`సరిలేరు నీకెవ్వరు` చిత్రం మహేష్ కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగానూ భారీ ఫిగర్స్‌నే దాటింది. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని మహేష్ ప్లాన్ చేసుకుని వెకేషన్ కోసం యుఎస్ వెళ్లిపోయారు. తిరిగొచ్చాక లెక్కలు మారిపోయాయి.
వంశీ చెప్పిన స్టోరీలో అంతగా విషయం వున్నట్టు అనిపించకపోవడంతో ఈ స్టోరీని పక్కన పెట్టిన మహేష్ ఆ స్థానంలో యంగ్ డైరెక్టర్ పరశురామ్ చెప్పిన కథని ఓకే చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశాయి. స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్న దశలో `భీష్మ` దర్శకుడు వెంకీ కుడుముల మహేష్‌కి ఓ బ్రిలియెంట్ లైన్‌ని వినిపించాడు. అతని నరేషన్ నచ్చి ఫుల్ స్టోరీతో రమ్మని మహేష్ మాటిచ్చాడు. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ ఇద్దరిలో ఎవరితో నెక్ట్స్ సినిమా చేయాలి? అనే డైలమా మొదలైందట. చివరికి పరశురామ్ రెడీ చేసిన స్క్రిప్ట్‌ని ఫైనల్ చేసినట్టు తెలిసింది.
మైత్రీతో పాటు ఈ చిత్రానికి 14 రీల్స్ ప్లస్ కూడా ఓ భాగస్వామిగా వ్యవహరిస్తుందని, జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఓ భాగస్వామిగా వ్యవహరిస్తుందని, మే లాంఛనంగా ప్రారంభించి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.