ప్రతీ ఒక్కరినీ ఓ ట్రబుల్ షూటర్ వున్నట్టే హీరో మహేష్‌కి కూడా ఓ ట్రబుల్ షూటర్ వున్నారు. అది మరెవరో కాదు ఆయన వైఫ్ నమ్రత. మహేష్ ఎంత వరకు మార్చాలో అంత వరకు మార్చి వరుస బ్రాండ్‌లకి బ్రాండ్ అంబాసిడన్‌ని చేసింది నమ్రతే. మహేష్ ట్రబుల్స్‌లో వుంటే రంగంలోకి దిగి ప్రెస్‌ని ఏకంగా ఏడిటర్లకి ఫోన్ చేసి మరీ ఫేవర్ చేయండని అడిగేస్తుంటారామె.
`శ్రీమంతుడు` సమయంలో కీలక మీడియా అధినేతలకు, ఎడిటర్లకు ఫోన్‌లు చేసి మరీ మహేష్ సినిమాని కొంచెం ప్రయోట్ చేయండని అడిగింది. స్వయంగా నమ్రతే ఫోన్ చేసి అడగడంతో అందరూ సపోర్ట్‌గా నిలిచారు. సినిమాలో విషయం వుంది కాబట్టి మరింతగా సపోర్ట్ చేశారు. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కూడా మహేష్ తన నెక్ట్స్ ఫిల్మ్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌లో వున్నాడు. వంశీ పైడిపల్లి సినిమాని పక్కన పెట్టిన మహేష్ ఆ స్థానంలో పరశురామ్‌ని లైన్‌లోకి తీసుకొచ్చాడు. ఇదే టైమ్‌లో వెంకీ కుడుముల ట్రెంమండస్ లైన్ వినిపించాడట. వెంటనే మహేష్ ఓకే చెప్పేశాడట.
ఇప్పడు ఈ ఇద్దరిలో ఎవరితో ముందు సినిమా మొదలుపెట్టాలన్నది మహేష్ కన్ఫ్యూజన్. దానికి తెరతీయాలంటే నమ్రత మళ్లీ రంగంలోకి దిగాల్సిందే అంటున్నారు. అందుకే ఆ బాధ్యతను మహేష్ నమ్రతకే వదిలేశాడట. ఆమె ఎవరితో ముందుకు వెళ్లాలని డిసైడ్ చేస్తే వారితో సినిమా మొదలుపెట్టాలని మహేష్ ఆలోచిస్తున్నాడట. ఇది డైరెక్టర్స్‌కి టెన్షన్ పుట్టిస్తోందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.