ఈ మధ్య హీరోయిన్‌లు వేసే డ్రస్సులు చూస్తుంటే వాళ్లు ఎందుకేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రచారం కోసం, నలుగురిలో అటెన్షన్‌ని క్రియేట్ చేయడం కోసం ఒళ్లంతా చూపించాలా? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మామూలుగా తాము అభిమానించే హీరోయిన్‌లు అర కొర డ్రెస్సుల్లో కనిపిస్తేనే తట్టుకోలేని ఫ్యాన్స్ ఓ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్న హీరోయిన్ అలాంటి డ్రెస్సులో కనిపిస్తే ఊరుకుంటారా? హర్టవుతారు. ఏంటీ మాకీ దరిద్రం అని తిట్టిపోస్తారు. సరిగ్గా అక్కినేని ఫ్యాన్స్ ఇదే చేస్తున్నారు.
హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సమంత అక్కినేని వారింటి కోడలు అయిన విషయం తెలిసిందే. చైతూని ఏడేళ్లు ప్రేమించి ఆ తరువాత అతని జీవిత భాగస్వామిగా మారిన సామ్ అప్పుడప్పుడు హద్దులు దాటి గ్లామర్ షో చేస్తోంది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలని పోస్ట్ చేయడం అక్కినేని అభిమానులని ఇరిటేట్ చేస్తోంది. తాజాగా సామ్ మళ్లీ అలాంటి పనే చేసింది. ఇటీవల జరిగిన జీ సినిమా అవార్డ్స్‌లో సమంత ఎల్లోకలర్ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో మెరిసింది. బికినీకి ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ని జతచేసినట్టుగా కనిపిస్తున్న ఈ డ్రెస్‌ని చూసి అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ఇలాంటి ఫ్యామిలీకి కోడలిగా వుండి అక్కినేని ఫ్యామిలీ పరువుతీస్తోందని, హద్దులు దాటి గ్లామర్ షో చేస్తోందని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సామ్‌ని ట్రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.