హీరో మంచు మనోజ్ ఇటీవల అతని భార్యతో విడిపోయాడు. ఈ విషయాన్ని వెల్లడించడానికి చాలానే సమయం తీసుకున్నాడు. వరుస పుకార్ల తరువాత సోషల్ మీడియా వేదికగా తన భార్యతో విడిపోయినట్టు వెల్లడించాడు. ఆ సమయంలో మానసికంగా చాలా డిప్రెషన్‌కి గురయ్యానని, ఫైనల్‌గా బలమైన నిర్ణయం తీసుకున్నానని, ఇకపై సినిమాల్లో కంటిన్యూ అవుతానని స్పష్టం చేశాడు. అయితే ఈ పిరియేడ్ నుంచి మంచు మనోజ్ బయటికి వచ్చాక సోదరుడు మంచు విష్ణు ఓ సలహా ఇచ్చారట.
అదేంటి? ఏమని తమ్ముడికి విష్ణు సలహా ఇచ్చాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా ముచ్చటించిన విష్ణు అసలు విషయం బయటపెట్టాడు. తమ్ముడు మనోజ్ విడాకుల సమయంలో చాలా మానసిక ఆందోళనకు గురయ్యాడని, అయితే విడాకులు తీసుకున్న వెంటనే మరో ఆలోచనకు వెల్లకుండా కొంత సమయం తీసుకున్నాకే వివాహం గురించి సరైన నిర్ణయం తీసుకోమని ఇందు కోసం ఎంత టైమ్ అయినా ఫరవాలేదు ఆలోచించి నిర్ణయం తీసుకోమని తాను చెప్పానని వెల్లడించాడు. ఆ మాట ప్రకారమే మళ్లీ పెళ్లి అనే మాటని ప్రస్తుతానికి పక్కన పెట్టి `అహం బ్రహ్మస్మి` చిత్రాన్ని మనోజ్ మొదలుపెట్టాడు.