మ‌ణిర‌త్నంకే ప్ర‌పోజ్ చేసింది!

మ‌ణిర‌త్నంకే ప్ర‌పోజ్ చేసింది!

ది గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంకే ఓ హీరోయిన్ ప్ర‌పోజ్ చేసి షాకిచ్చింది. భార‌తీయ సినీ తెర‌పై మ‌ణిర‌త్నంది చెర‌గ‌ని సంత‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చిన చిత్రాల్నీ ఆణిముత్యాలే. జాతీయ స‌మ‌గ్ర‌త‌రి చాటిచెప్పిన ఆయ‌న సినిమాలు ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్‌లే. అలాంటి ద‌ర్శ‌కుడికే ప్ర‌పోజ్ చేసిందో హీరోయిన్‌. ఈ దృశ్యం మూడేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో జ‌రిగినా తాజాగా దీన్ని బ‌య‌ట పెట్టింది.

మూడేళ్ల క్రితం కార్తి హీరోగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం `కాట్రు వెలియిడై`. ఇదే చిత్రాన్ని తెలుగులో `చెలియా` పేరుతో రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. సినిమా దారుణమైన ఫ‌లితాన్నిచ్చినా ఈ చిత్రంలోని పాట‌ల‌కీ, ఫొటోగ్ర‌పీకి మంచి పేరొచ్చింది.

ఈ చిత్రంలో కార్తికి జోడీగా బాలీవుడ్ భామ అదితీరావు హైద‌రీ న‌టించింది. ఈ సినిమా సెట్‌లో ఓ రోజు స‌ర‌దాగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు అదితీరావు హైద‌రీ ఓ రోజ్ ఫ్ల‌వ‌ర్‌ని అందిస్తూ ప్ర‌పోజ్ చేయ‌డం అక్క‌డున్న వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ట‌. ఆ త‌రువాత అదితి స‌ర‌దాగా ఆట‌ప‌ట్టిస్తోంద‌ని తెలిసి అంతా న‌వ్వుకున్నార‌ట‌. ఈ స‌ర‌దా సంఘ‌ట‌న‌కు సాక్ష్యంగా నిలిచిన ఆనాటి ఫొటోని తాజాగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా త‌న అభిమానుల‌తో పంచుకుంది అదితీరావు హైద‌రీ. ఈ ఫొటో ప్ర‌స్తుతం ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతోంది.