సోషల్ మీడియాలో మెగా హీరో రామ్‌చరణ్‌కి మించి యాక్టీవ్‌గా వుంటోంది ఉపాసన. వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ రక్షణలో భాగంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం అంటూ హంగామా చేసిన ఉపాసన ఈ మధ్య వరుస ట్వీట్‌లతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇన్ స్టాని కూడా వదలడం లేదు. తాజాగా రాజమౌళి విసిరిన `బీ ద రియల్ మెన్` ఛాలెంజ్‌కి రామ్‌చరణ్ స్పందించిన విషయం తెలిసిందే.
ఉపాసన కోసం ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి పని చేసి మొక్కలకు నీళ్లు పోయడం, బట్టలు సర్దడం, ఫ్లోర్ క్లీన్ చేయడం వంటికి చేసిన రామ్‌చరణ్ ఆ వీడియోని పోస్ట్ చేసి మరి కొంత మందికి సవాల్ విసిరారు.
ఈ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసిన ఉపాసన `మై హీరో నిజమైన మగాడు` అంటూ భర్త రామ్‌చరణ్‌పై ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించింది.
ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ వుంటేనే ఆ బంధం బాగుంటుందని, తార తమ్యాలు భావించని వారే నిజమైన మగాడని, ఆ విషయంలో తన భర్త రామ్‌చరణ్ నిజమైన మగాడని అభివర్ణించింది. జీవిత భాగస్వామి భావాల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఉపాసన కోరింది. ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోపై, ఉపాసన కామెంట్స్‌పై నెటిజన్స్‌ని కామెంట్‌లు పెడుతున్నారు.