మెహ‌ర్ ర‌మేష్ భ‌లే షాకిచ్చారే!

మెగా క్యాంపుకు సంబంధించిన మెహర్ రమేష్ ఘట్టమనేని హీరో చుట్టు ఎందుకు తిరుగుతున్నాడు?. అతనితో సినిమా చేయబోతున్నాడా?. ఫ్లాపులతో డైరెక్షన్కి బ్రేకిచ్చిన మెహర్ రమేష్కి మహేష్ సినిమా ఇస్తాడా?.. ఇలా గత కొంత కాలంగా మెహర్ రమేష్పై వరుల కథనాలు వినిపించాయి. ఎవరు ఎంతగా వార్తలు రాసినా మెహర్ రమేష్ మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. గ‌త కొంత కాలంగా నిత్యం మ‌హేష్ వెంటే తిరుగుతున్న మెహ‌ర్ ర‌మేష్ కొత్తగా డిస్ట్రిబ్యూట‌ర్ అవ‌తారం ఎత్త‌డం అవ‌ద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

మ‌హేష్ న‌టించిన తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికే వర‌ల్డ్ వైడ్‌గా వంద కోట్లు దాటేసింది. ఈ చిత్రాన్ని గుంటూరు ఏరియాని మెహ‌ర్ ర‌మేష్ తీసుకున్నార‌ట‌. భారీ లాభాల్ని తెచ్చిపెట్టింద‌ని, మహేష్ కెరీర్‌లోనే గుంటూరులో ఆల్ టైమ్ రికార్డుని సృష్టించింద‌ని, ఎక్క‌డ ఆగుతుందో తెలియ‌ద‌ని మెహ‌ర్ ర‌మేష్ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్‌బ‌స్ట‌ర్‌కా బాప్ కార్య‌క్ర‌మాన్ని చిత్ర బృందం హ‌న్మ‌కొండ‌లో శుక్ర‌వారం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా మెమ‌ర్ ర‌మేష్ స్టేజ్‌పై తాజా వ్యాఖ్య‌లు చేశారు.