కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ని టాలీవుడ్ లోనే అగ్రగామి ప్రొడక్షన్ హౌస్ గా నిలబెట్టాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంకల్పించి ముందుకు వెళ్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ `ఖైదీ నంబర్ 150` తో ప్రారంభమైన సదరు సంస్థ వరుసగా సినిమాలు నిర్మిస్తూ దూకుడు చూపిస్తుంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత వెంటనే చిరుతోనే పాన్ ఇండియా లెవల్లో `సైరా నరసింహారెడ్డి`ని ( 151)వ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ భాగస్వామ్యంలో చరణ్ కొదిణెదల ప్రొడక్షన్ పైనే చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల దర్శకత్వంలో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు.
అటు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఇతర భాషల సినిమా రీమేక్ హక్కులను చేజిక్కించుకుంటున్నారు. సైరా సెట్స్ లో ఉండగానే మలయాళంలో సక్సెస్ అయిన `లూసిఫర్` రీమేక్ రైట్స్ కొన్నారు. మెగాస్టార్ తోనే ఈచిత్రాన్ని సుకుమార్ ని రంగంలోకి దించి ఈ డివోషనల్ చిత్రన్ని నిర్మించాలని చూస్తున్నారు. మెగాస్టార్ 152వ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత దానిపై ఓ క్లారిటీ రానుంది. తాజాగా చరణ్ మరో మలయాళ బ్లాక్ బస్టర్ స్ర్కిప్ట్ ని లాక్ చేసినట్లు సమాచారం.
మలయాళ నటుడు పృథ్వీ నటించిన `డ్రైవింగ్ లైసెన్స్` రీమేక్ రైట్స్ చరణ్ కొనుగోలు చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇదొక కామెడీ డ్రామ. మెగాస్టార్ తో రీమేక్ చేయాల్సిన చిత్రం కాదు. ఈ నేపథ్యంలో ఆ చిత్రాన్ని మెగా కాంపౌండ్ లో మిగతా హీరోలలో ఎవరో ఒకరితో రీమేక్ చేసే థాట్ ప్రాసస్ లో భాగంగానే చరణ్ రైట్స్ తీసుకుని ఉంటారని తెలుస్తోంది. వరుణ్ తేజ్…బన్నీ..సాయితేజ్..వైష్ణవ్ తేజ్..శిరీష్ ఇలా అరడజనకు పైగా హీరో అదే కాంపౌండ్ లో ఉన్నారు కాబట్టి చరణ్ ఆ దిశగా ఆలోచనే చేసే అవకాశం ఉంది. లేకపోతే తానే నటించాలని రైట్స్ తీసుకున్నాడా? అన్న డిటైల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.