మెగా ఛాన్స్ కొట్టేసిన నభ నటేష్?

‘ఇస్మార్ట్ శంకర్’ ఈ సినిమాతో చాలా మంది గట్టెక్కారు. హీరో రామ్, దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి తదితరులను ఈ సినిమా గట్టెక్కించింది. ఆ పైన ఈ సినిమాలో హీరోయిన్ నాభ నటేష్ కు కూడా ఈ సినిమా కలిసొచ్చిందనే చెప్పాలి. యాడ్లు, ప్రారంభోత్సవాలతో పాటు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.

తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సుబ్బు అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో నభ నటేష్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇది చాలా మంచి అవకాశమే చెప్పాలి నభకి. ఏది ఏమైనా ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, మారుతి దర్శకత్వంలో ‘ప్రతీ రోజు పండగే’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.