మెగాస్టార్ ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ రెడీ!

మెగా వెబ్ సిరీస్ ఆలోచ‌న‌లో మెగాస్టార్

ఈ ఉగాదికి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త‌డేకి రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ల రూపంలో టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌, బ‌ర్త్‌డే కానుక‌గా రామ్‌చ‌ర‌ణ్ రామ‌రాజు పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేసి `ఆర్ ఆర్ ఆర్` టీమ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇదే త‌ర‌హాలో మెగాస్టార్ కూడా భారీ స‌ర్‌ప్రైజ్ నే ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలిసింది.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నాడు. దేవాదాయ కుంభ‌కోణం నేప‌థ్యంలో న‌క్స‌లిజం ప్ర‌ధానంగా ఈ సినిమా సాగుతుంద‌ని తెలుస్తోంది. కీల‌క అతిధి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్, టైటిల్ ని ఏప్రిల్ 2న శ్రీ‌రామ న‌వమి సంద‌ర్భంగా రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌ని చిరు, కొర‌టాల ప్లాన్ చేస్తున్నార‌ట‌.

అయితే ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఉగాది రోజునే `ఆచ‌ర్య‌` ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త‌డే వుండ‌టం, రాజ‌మౌళి టీమ్ `ఆర్ ఆర్ ఆర్‌` ఫ‌స్ట్ లుక్ టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేయ‌డంతో ఉగాది రోజును వారికే వ‌దిలేసి `ఆచార్య‌` ఫ‌స్ట్ లుక్‌ను శ్రీ‌రామ న‌వ‌మికి వాయిదా వేసుకున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.