“మా ” రచ్చో త్సవంలో భగ్గుమన్న విభేదాలు … నరేష్ వెనుక…?

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వ్యక్తిగత అభిప్రాయం భేదాలు ఒక్కసారి భగ్గున మండి రజతోత్సవం  కాస్తా రచ్చో త్సవం గా మారిపోయింది . అధ్యక్షుడు శివాజీరాజా ,ప్రధాన కార్యదర్శి నరేష్ ఒకరిపై మరొకరు  మాటల తూటాలు పేల్చుకున్నారు . మా  రజతోత్సవం  ఘనంగా నిర్వహించాలని , ఒక అధునాతన భవనాన్ని కూడా నిర్మించుకోవాలని అనుకున్నారు .

ఇందుకోసం నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నారు . ముందుగా మెగాస్టార్ చిరంజీవిని సంప్రదిస్తే ఆయన అమెరికా రావడానికి ఒప్పుకున్నారు . చిరంజీవి ద్వారా 2కోట్లు వసూలు  చేస్తామని శివాజీ రాజా మిగతా  సభ్యులు చెప్పారు . తీరా ఒక కోటి రూపాయలతో వచ్చారు .

అయితే వసూలు చేసిన డబ్బులో  శివాజీ రాజా కొంత నొక్కేసాడని నరేష్ ఆరోపణ. అమ్మతోడు, పిల్లమీద ఒట్టు  ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదు అని శివాజీరాజా, నిరూపిస్తే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శ్రీకాంత్ ప్రెస్  మీట్  పెట్టి మరి చెప్పారు . 

నరేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి నిధులు దుర్వియోగము అయ్యాయా ? లేదా అనే విషయం తేల్చడాని ఓ కమిటీ వేస్తామని ప్రకటించాడు .  అమెరికా వెళ్లి వచ్చి చాలా రోజులు అవుతుంది . ఇంతకాలం దీనిపై మాట్లాడకుండా ఇప్పుడు నరేష్ ఎందుకు మాట్లాడినట్టు ? ఎదో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారమని పైకి చెబుతున్నా , లోపల మాత్రలు వ్యక్తిగత గొడవలున్నాయని అంటున్నారు .

మా మొత్తం శివాజీరాజా కనుసన్నల్లో నడిపిస్తున్నాడని , తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నరేష్ లోపల మండిపోతున్నాడు . వచ్చే నెలలో మహేష్ తో అమెరికాలో కార్యక్రమాలు జరగబోతున్నాయి . దీనికి నరేష్ నాయకత్వం వహించాలనేది మనసులోని కోరిక . అందుకే ముందస్తు వ్యూహాన్ని అమలు చేశాడని కొందరు చెబుతున్నారు . నరేష్ వెనుక మా మాజీ అధ్యక్షుడు ఉండి  కథ మొత్తం నడిపిస్తున్నాడని , అతనికీ శివాజీ రాజాకు అస్సలు పడదని , అందుకే నరేష్ వెనుక అతను ఉండి  రెచ్చకొడుతున్నాడని  అనుకుంటున్నారు .

 
ఈ ఆరోపణల పర్వాన్ని పరిశీలిస్తే నరేష్ పెట్టిన ప్రెస్ మీట్లో  మాణిక్ , గౌతమ్ రాజు తప్ప ముఖ్యమైన వారు ఎవరు కనిపించలేదు . శివాజీ రాజా ప్రెస్ మీట్లో పరుచూరి వెంకటేశ్వరరావు శ్రీకాంత్ , బెనర్జీ , ఏడిద శ్రీరామ్ , హేమ తదితరులు వున్నారు . దీనినిబట్టి మాలో నరేష్ కు అంత సపోర్ట్ లేదని తేలిపోయింది . మరి ఎందుకు ఈ రగడ అంటే ఇగో కోసం .