మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఇండస్ట్రీ వ‌ర్గాలకే కాదు ఆయ‌న‌ని నిశితంగా ప‌రిశీలించిన ప్ర‌తీ ఒక్క‌రికీ ఈ విష‌యం తెలుసు. అలాంటి మాస్ట‌ర్ మైండ్ లెక్క త‌ప్పింది.

అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాన్ని స్టార్ హీరో మ‌హేష్ సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` పోటీ వున్నా దాన్ని అల‌వోక‌గా ఓవ‌ర్ టేక్ చేసి త‌న‌యుడికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని అందించాడు. అయితే సొంతంగా ఏర్పాటు చేసిన ఆహా ఓటీటీని మాత్రం స‌క్సెస్ చేయ‌లేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇండియా 21 డేస్ లాక్ డౌన్ ని ప్ర‌క‌టించింది. ఈ స‌మ‌యాన్ని జీ5, నెట్ ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ విజ‌య‌వంతంగా స‌ద్విన‌యోగం చేసుకుంటున్నాయి. కానీ ఆ స్థాయిలో ఆహా మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోతోంది. కార‌ణం ఈ యాప్‌లో స‌రైన స్ట‌ఫ్ లేక‌పోవ‌డ‌మే. ఇందుకు అల్లు అర‌వింద్ ప్లానింగ్ ఫేయిల్ కావ‌డ‌మేన‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.