మంజుల, హన్సికలతో ‘భాగమతి’ డైరక్టర్

వెబ్ సీరిస్ తెరకెక్కిస్తోన్న మంజులు

మహేష్ బాబు సోదరి మంజుల సినిమా నిర్మాణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందిరా ప్రొడక్షన్ సంస్థను స్థాపించి గతంలో కొన్ని చిత్రాలను నిర్మించారు. రీసెంట్ గా సందీప్ కిషన్ తో మనసుకు నచ్చింది సినిమా చేశారు. ఈ సినిమా ప్లాఫ్ కావడంతో.. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి తెర తీయబోతోంది.

ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్లో మంజుల ఓ వెబ్ సీరీస్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదట అ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెబ్ సీరీస్ ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు పిల్ల జమీందార్, భాగమతి చిత్రాల దర్శకుడు అశోక్ సీన్ లోకి వచ్చారు. నషా టైటిల్ తో రూపొందే ఓ వెబ్ సీరిస్ ని డిజైన్ చేస్తున్నారు.

హన్సిక, మంజుల కాంబినేషన్ లో రూపొందే ఈ వెబ్ సీరిస్ విభిన్నంగా సాగుతుందని చెప్తున్నారు. అశుతోష్ రానా ఈ వెబ్ సీరిస్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైపోయింది. షూటింగ్ లో ఎక్కువ భాగం ముంబై లో జరగనుంది. మరో ప్రక్క సమంత సైతం ఓ వెబ్ సీరిస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మంజుల సినిమాలు భాక్సాఫీస్ దగ్గర నిరాశపరచగా..ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తూ వెబ్ సీరీస్ తో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. సూపర్ స్టార్ సిస్టర్ ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు మహేష్ అభిమానులు.