`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని ద‌ర్శ‌కుడు, హీరోయిన్, నిర్మాత బ్లాక్ బ‌స్ట‌ర్ కేక్‌ని కూడా క‌ట్ చేశారు. వారి ఊహకు త‌గ్గ‌ట్టే తొలి రోజు వ‌సూళ్లు అదిరాయి. ఈ సినిమాతో ఫ్లాపుల్లో వున్న నితిన్ ఫేట్ ఒక్క‌సారిగా మారిపోయింది. వెంకీ కుడుముల కామెడీని న‌మ్ముకుని చేసిన ఈ ప్ర‌యోగం ఫ‌లించింది. తొలి రోజు మంచి వ‌సూళ్ల‌ని అందించింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు 6 కోట్లు వ‌సూలు చేయ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ని ఆక‌ట్టుకుంటోంది.

`భీష్మ‌` తొలి రోజు వ‌సూళ్ల వివ‌రాలు

నైజాం : 2.20 కోట్లు

సీడెడ్ : 0.80 కోట్లు

వైజాగ్ : 0.62 కోట్లు

గుంటూరు : 0.77 కోట్లు

ఈస్ట్ : 0. 66 కోట్లు

వెస్ట్ : 0. 56 కోట్లు

కృష్ణా : 0. 40 కోట్లు

నెల్లూర్ : 0. 27 కోట్లు

ఏపీ, తెలంగాణల్లో తొలి రోజు వ‌సూళ్లు మొత్తం 6.28 కోట్లు.