నాని vs సుధీర్ బాబు – ఎవరు గెలుస్తారు?

ర‌క్ష‌కుడు వ‌ర్సెస్ రాక్ష‌సుడి స‌మ‌రానికి డేటు టైమ్ ఫిక్స‌యింది. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `వి`. నివేదా థామ‌స్‌, అదితీరావు హైద‌రీ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి డేట్ ఫిక్స‌యింది. మార్చి 25న ఉగాది రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కొత్త త‌ర‌హా చిత్రాల‌కు శ్రీ‌కారం చుట్టిన నాని `వి`తో మ‌రో విభిన్న‌మైన అటెమ్ట్‌కు సిద్ధ‌మైపోతున్నాడు. ఇందులో అత‌ని పాత్ర రాక్ష‌సుడిని త‌ల‌పిస్తుంద‌ని చిత్ర బృందం చెబుతోంది.

ఇటీవ‌ల ర‌క్ష‌కుడిగా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తుండ‌గా రాక్ష‌సుడిగా అంత‌కు మించిన పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని కనిపించ‌బోతున్నారు. నాని రాక్ష‌సుడిలా అంద‌రిని శిక్షిస్తుంటే సుధీర్ బాబు అత‌నికి అడుగ‌డుగునా అడ్డుప‌డుతూ ర‌క్షిస్తుంటాడ‌ట‌. టామ్ అండ్ జెర్రీ త‌రహాలో సాగే ఈ సినిమాపై ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, హీరో నాని భారీ అంచ‌నాలే పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ విజ‌యం సాధించి ఈ చిత్రం కొత్త పంథాకు శ్రీ‌కారం చుడుతుందేమో చూడాల‌ని నాని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇద్ద‌రి లుక్‌ని హీరో సుధీర్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తూ `బొమ్మ బొరుసు.. నేరం.. న్యాయం!` అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని ఈ నెల 17న విడుద‌ల చేస్తున్నారు.