కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బిగ్ బాస్-4 వ సీజన్ ఉంటుందా? లేదా? వ‌్యాక్సిన్ వచ్చే వరకూ షూట్ ఆపేస్తారా? అని ఇలా చాలా అనుమానాలు షోపై ఉన్నాయి. అయితే వైరస్ వ్యాప్తితో సంబంధం లేకుండా సీజన్-4ని కొనసాగించేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఫిజికల్ టాస్క్ లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది? కదా? అన్న నేపథ్యంలో నిర్వాహకులు అందుకు ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతున్నారుట. ఫిజికల్ టాస్క్ లు లేకుండా….వైరస్ రిలేటెడ్ గా ఉండే కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారుట.
ప్రస్తుతం గేమ్ షోకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా సెట్ నిర్మిస్తు న్నారు. కొవిడ్ కారణంగా సెట్లో చాలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలా కాకుండా ఎక్కువ స్పేస్ ఉండేలా నిర్మాణం చేపడుతున్నట్లు తెలిసింది. అయితే గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో గతసారి పెద్ద ఎత్తున నిర్వాహకులు కాస్టింగ్ కౌచ్ కి పాల్పడినట్లు కొంత మంది నటీనటులు ఆరోపించిన సంగతి తెలిసిందే. సరిగ్గా `మీటూ ఉద్యమం` మోతెక్కిపోతున్న సమయంలో ఆ వార్త బయటకు రావడం మరింత ప్రకంపనలు సృష్టించింది.
అయితే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారుట. ఇక హోస్ట్ గా సీజన్ -3కి పనిచేసిన నాగార్జుననే ఈసారి కూడా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అందుకు గాను నాగ్ 5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారుట. అయితే షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? కంటెస్టెంట్ల వివరాలు ? మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇక హిందీ బిగ్ బాస్ మాత్రం సెప్టెంబర్ నుంచి ప్రసారం కానుందని సమాచారం.