మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం `అలవైకుంఠపురంలో`ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది విడుదలైనప్పటి నుంచి మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంటుంది. ఇక కలెక్షన్ల పరంగా ఎక్కడా తగ్గకుండా మొదటి రోజు నుంచి కూడా 26.5 కోట్ల షేర్ ను వసూలు చేస్తుంది. రెండో రోజు 10 కోట్ల వసూళ్లతో స్టడీగా నిలిచింది. ఇక మూడు, నాలుగు రోజుల్లో 11 కోట్ల పైచిలుకు షేర్లతో ట్రేడ్ పండితులను కూడా విస్మయానికి గురి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఈ వసూళ్లతో చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులను సాధించిందనే చెప్పాలి.
బాహుబలి 2 విడుదలయ్యాక అప్పటిదాకా టాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డును పెద్దగా ఎవరూ లెక్కచేయని విషయం తెలిసిందే. ఈ సినిమా వసూళ్లు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగాయి. దాని తర్వాత టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగానే వచ్చాయి కానీ ఏదీ బాహుబలి 2 రికార్డులను మాత్రం టచ్ చేయలేకపోయాయి. అందుకే అప్పటి నుండి నాన్ బాహుబలి రికార్డు అంటూ ఒక సెక్షన్ ను మొదలుపెట్టారు.
ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డును కొల్లగొట్టే క్రమంలో ఉంది. నిన్న కూడా ఈ చిత్రం 11 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకోవడంతో.. వరసగా ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో డబల్ డిజిట్ షేర్ సాధించిన చిత్రంగా బాహుబలి 2 సరసన నిలిచింది. అంటే అంతటి ఖ్యాతి దక్కించుకుంది. బాహుబలి2 తర్వాత తిరిగి మళ్ళీ ఈ చిత్రానికే అది సాధ్యమైంది. ఆ చిత్రం కూడా ఐదు రోజుల పాటు డబల్ డిజిట్ షేర్ తెచ్చుకుంది. అయితే ఇక పండగ సీజన్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే ఈరోజు కూడా అల వైకుంఠపురములో డబల్ డిజిట్ షేర్ ను తన ఖాతాలో వేసుకొనేటట్లే ఉంది.