తెలుగు సినీ సంగీతంలో ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి కాలానికి తగ్గట్టు. అప్పుడెప్పుడో మణి శర్మ ఆ తరువాత దేవి శ్రీ ప్రసాద్, ఆ మధ్య తమన్. ఇప్పుడు అనిరుద్ రవిచందర్. ప్రస్తుతం ఈ తమిళ సంగీత దర్శకుడిదే తెలుగులో హవా.
‘జెర్సీ’ సినిమా హిట్ తరువాత అతనికి ఇక్కడ పుష్కాలనగానే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బన్నీ ‘ఐకాన్’ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నాడు. అయినా తమిళ సంగీత దర్శకులు ఎంతో మంది తెలుగులోనూ పని చేశారు మరపురాని పాటలు అందించారు. ఇప్పుడు ఆ కోవలోకే అనిరుద్ చెందుతాడు.