సినిమా ఇండస్ట్రీలో హిట్ మాత్రనమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వరకైనా తీసుకెళుతుంది. అడగని అందలం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ పడిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బట్టే ఇక్కడ కథలు, కాంబినేషన్‌లు, ప్రాజెక్ట్‌లు పుట్టుకొస్తుంటాయి. కానీ రామ్‌చరణ్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆర్ ఎఫ్‌సీలో జరుగుతోంది.
ఇదిలా వుంటే రామ్‌చరణ్ `ఆర్ ఆర్ ఆర్` తరువాత మలయాళ హిట్ ఫిల్మ్ `డ్రైవింగ్ లైసెన్స్` రీమేక్‌లో నటించబోతున్నాడని, ఇప్పటికే ఆ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడని వరుస కథనాలు వినిపిస్తున్నాయి. అయితే వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆ సినిమా రీమేక్ రైట్స్ ఇంకా రామ్‌చరణ్ తీసుకోలేదని, త్వరలో `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని తెలిసింది. విక్రమ్ కె. కుమార్ 24, హల్లో, గ్యాంగ్ లీడర్ వంటి వరుస ఫ్లాపుల్లో వున్నారు.
అయినా సరే అతని టాలెంట్‌పై వున్న నమ్మకంతో అతనితో సినిమా చేయడానికి రామ్‌చరణ్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇటీవల విక్రమ్ కె. కుమార్ ఓ కథ వినిపించారట. చెప్పిన స్టోరీ, స్క్రీన్‌ప్లే కొత్తగా యూనిక్‌గా, ట్రెండ్ సెట్టింగ్‌గా వుండటంతో రామ్‌చరణ్ వెంటనే ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్నారట. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏప్రిల్‌లో రానుందని తెలిసింది.