ప్ర‌ధాని స‌ప్త సూత్రాల‌పై సాయి కుమార్ ఏమ‌న్నారంటే!

ప్ర‌ధాని స‌ప్త సూత్రాల‌పై సాయి కుమార్ ఏమ‌న్నారంటే!

దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనాపై విజయం సాధించడానికి సప్త సూత్రాలు పేరిట ఆయన 7 సూత్రాలను ప్రజలకు వివరించారు. వాటిని కచ్చితంగా అమలు చేసినట్లయితే తప్పకుండా కరోనాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు, బిజేపీ నేత సాయికుమార్ కూడా త‌న స్టైల్లో కొవిడ్ -19 ఎలా ఎదుర్కోవాల‌ని ఓ వీడియో ద్వారా సూచించారు.

మ‌న ప్రియ‌త‌మ ప్ర‌ధాని మోదీగారి స‌ప్త‌సూత్రాలు 1)వృద్ధుల‌ను జాగ్ర‌త్త‌గా చూస్కోండి. 2)మే 3 వ‌ర‌కూ లాక్ డౌన్ ని కొన‌సాగిస్తూ మాస్క్ లు ధ‌రించి సామాజిక దూరం పాటించండి. 3) రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోండి. 4) పేద‌ల‌కు వీలైనంత సాయం చేయండి. 5) ఆరోగ్య సేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. 6) తోటి ఉద్యోగుల‌కు..మీ మీద ఆధార‌ప‌డ్డ‌వారికి ఆస‌రాగా నిల‌బ‌డండి. 7) కోవిడ్-19 మీద పోరాడుతున్న ప్ర‌తీ ఒక్క‌రిని గౌర‌వించండి. వారికి స‌హ‌క‌రించండి. ఇది మ‌న క‌ర్త‌వ్యం మ‌న బాధ్య‌త‌. స్టే హోమ్.స్టే సేఫ్. దేశ ప్ర‌జ‌లైన మ‌నం వీట‌న్నింటిని పాటిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేద్దాం. క‌రోనాని త‌ర‌మి కొడ‌దాం.జైహింద్` అని అన్నారు.