ప్రభాస్ సినిమాలో విలన్ గా జగపతి బాబు?

ప్రస్తుతం ప్రభాస్ తన తరువాతి సినిమా పై దృష్టి సారించారు. ఈ సినిమాను ‘జిల్’ చిత్రం దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం చిత్ర బృందం జగపతి బాబుని సంప్రదించింది.

అయితే ఇంకా ఈ చిత్రానికి అయన సంతకం చేసారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జగపతి బాబు, ప్రభాస్ చిత్రంలో ఆయనకు విలన్ గా నటిస్తే ఆ కిక్కే వేరు అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది.

బాహుబలి, సాహు సినిమాలతో కొన్నేళ్ల పాటు ఒకే సినిమాకి అంకితం అయిపోయిన ప్రభాస్ ఇక పై వరుసగా సినిమాలు విడుదల చేయాలనుకుంటున్నాడు. ప్రభాస్ అభిమానులకు ఇది మంచి వార్తే కదూ.