హీరో సూర్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

తమిళ్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్బంగా ఆయన కొత్త సినిమా ‘బందోబస్త్’ బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ విడుదల చేసింది. కెవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య, సయేషా హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ‘బందోబస్త్’. మోహన్ లాల్ మరియు తమిళ్ హీరో ఆర్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది

ఈ సినిమా ఆడియో లాంచ్ ఈ మధ్యనే జరిగింది. ఆ వేడుకకి రజిని సైతం విచ్చేసి హీరో సూర్యని వెన్ను తట్టారు. ప్రస్తుతం ప్లాపుల వల్ల మార్కెట్ కాస్త కుదేలైంది. దాంతో ఈ హిట్ సూర్యకి తప్పనిసరిగా మారింది. ఏది ఏమైనా ఈ పుట్టినరోజుతో ఆయనకీ అన్నీ అనుకూలంగా జరుగుతాయని ఆశిద్దాం.