పాపం..కొనుక్కునే వాళ్లే కరువు అయ్యారు

‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ …రిలీజ్ కష్టాలు

చిన్న సినిమాలకు నిజంగా గడ్డు రోజులు నడుస్తున్నాయి. అన్ని ఖర్చులూ బాగా పెరిగిపోవటంతో చిన్న సినిమాలను రిలీజ్ చేసి రిస్క్ చేయటానికి ఎవరూ ఉత్సాహం చూపించటం లేదు. మరీ ముఖ్యంగా దేశభక్తి, సందేశాత్మక చిత్రాల పరిస్దితి అయితే ఘోరం. ఏదన్నా మసాలా ఉంటే కొద్దిలో కొద్ది బెస్ట్..మినిమం బిజినెస్ అవుతోంది. అందులోనూ ఆది లాంటి ప్లాఫ్ హీరోతో దేశభక్తి సినిమా చేస్తే పరిస్దితి మరీ ఘోరం.

ఆది సాయికుమార్ హీరోగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి విలన్ గా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. విజయదశమి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా బిజినెస్ లో కదిలిక లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కావటం లేదు. బయ్యర్లు…

ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యాక ఆడవచ్చేమో కానీ ముందు కొనేటంత ధైర్యం చేయలేం అంటున్నారు.

దర్శకుడు సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ ‘‘మాది క్రాస్ జోనర్ ఫిల్మ్. వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తీసిన ఫిక్షనల్ ఫిల్మ్. ఈ సినిమా ప్రయాణంలో అబ్బూరి రవి నాకు ఎమోషనల్ సపోర్ట్ గా నిలిచారు. బ్యాక్ బోన్ లా నిలబడ్డారు. కశ్మీర్‌ నుండి ఇతర ప్రాంతాలకు వచ్చి సెటిలైన కశ్మీర్‌ పండిట్స్‌తో కూర్చుని, వాళ్లతో మాట్లాడి… అసలేం జరిగింది? అని సమస్య లోతుల్లోకి వెళ్లి, కంప్లీట్‌ రీసెర్చ్‌ చేసి అబ్బూరి రవి స్క్రిప్ట్‌ రాశారు. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి, ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం, ఇంకా శ‌షా చెట్రి, కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు అన్నారు.

ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ” సాయికిరణ్‌ అడివి ఈ కథ చెప్పి… అందులో ఎన్‌.ఎస్‌.జి కమాండో అర్జున్‌ పండిట్‌ క్యారెక్టరైజేషన్‌ చెప్పారు. అప్పటికి కశ్మీర్‌లో సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నంత లేవు. కశ్మీర్‌ సమస్యను మేం పబ్లిసిటీకి వాడుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం సాయికిరణ్‌ అడివి కథ రాసుకున్నారు. ఈ సినిమాలో కొన్ని నిజాలు చెప్పాం. హృదయాలను హత్తుకునే నిజాలు చెప్పాం. మరోపక్క రొమాంటిక్‌ ట్రాక్‌ ఉంటుంది. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు చూస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.