న‌య‌న ఆ జ్ఞాప‌కాల్ని చెరిపేసింది!

న‌య‌న ఆ జ్ఞాప‌కాల్ని చెరిపేసింది!

`ప‌చ్చ బొట్టు చెరిగీ పోదులే…` అన్నాడో సినీ క‌వి .. కానీ న‌య‌న‌తార మాత్రం ఆ మాట త‌ప్ప‌ని నిరూపించింది. గ‌త కొన్నేళ్ల క్రితం న‌య‌న‌తార డ్యాన్సింగ్ సెన్సేష‌న్ ప్ర‌భుదేవాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలింది. `శ్రీ‌రామ‌రాజ్యం` చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌రువాత ముంబైలో వివాహం చేసుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నారు కూడా. ఆ త‌రువాత నుంచి న‌య‌న సినిమాల‌కు గుడ్ బై చెప్పాల‌నుకుంది కూడా.

ఈ ఇద్ద‌రి ప్రేమాయ‌ణం మాంచి పీక్స్‌లో వున్న స‌మ‌యంలో న‌య‌న‌తార త‌న ప్రేమ‌కు గుర్తుగా ఎడ‌మ‌చేయిపై ప్ర‌భుదేవా పేరుని టాటూ వేయించుకుంది. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం, విడిపోవ‌డం అంద‌రికి తెలిసిందే.

ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివ‌న్‌తో గ‌త కొంత కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తోంది. అయితే ప్ర‌భుదేవా టాటూని మాత్రం అలాగే వుంచేసింది. తాజాగా న‌య‌న ప్ర‌భుదేవా జ్ఞాప‌కంగా వేయించుకున్న టాటూని తొలగించుకుని షాకిచ్చింది. త్వ‌ర‌లోనే విగ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార వివాహం చేసుకోబోతున్నారు. త‌మ పెళ్లి వార్త‌ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌బోతున్నార‌ట‌.