ఏడాదికి ఒకటి అర సినిమాలతో సరిపెట్టుకునే తెలుగు హీరోలు 2020లో మాత్రం పూనకాలు వచ్చిన వారిలా వరుస ప్రాజెక్ట్‌లని ప్రకటించేస్తున్నారు. పవన్ ఏకంగా మూడు నుంచి ఐదు చిత్రాల్ని లైన్‌లో పెట్టేసి ఆశ్చర్యానికి గురిచేస్తుంటే మినిమమ్ గ్యారెంటీ హీరో నేచురల్ స్టార్ నాని కూడా అదే ఊపుని చూపిస్తున్నాడు. వరుసగా నాలుగు చిత్రాలతో బిజీగా మారిపోయాడు.
`జెర్సీ`తో హిట్‌ని విమర్శకుల ప్రశంసల్నీ అందుకున్న నాని ఆ తరువాత చేసిన `గ్యాంగ్ లీడర్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సారి పక్కా ప్లానింగ్‌తో ఈ ఏడాది ఖచ్చితంగా రెండు నుంచి మూడు చిత్రాల వరకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అందులో బాగంగానే నాలుగు చిత్రాల్ని లైన్‌లో పెట్టేశాడు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణతో `వీ` చిత్రాన్ని చేస్తున్న నాని ఆ వెంటనే శివ నిర్వాణతో `టక్ జగదీష్`ని స్టార్ట్ చేసేశాడు.
ఇదిలా వుండగానే `టాక్సీవాలా`డైరెక్టర్‌తో మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తారట. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రానుంది. దీనితో పాటు `నేను లోకల్` డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో కూడా ఓ చిత్రాన్ని నాని కమిట్ అయినట్టు తెలిసింది. ఇది ఎప్పుడు మొదలవుతుంది?. నిర్మాత ఎవరుండే అవకాశం వుంది అన్నది ఇంకా స్పష్టత రాలేదు.