నెటిజ‌న్‌కు రానా దిమ్మ‌దిరిగే రిప్లై!

ఇండ‌స్ట్రీలో బందుప్రీతి వుందంటూ గ‌త కొంత కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అందులో త‌ప్పేముంద‌ని ఇటీవ‌ల అల్లు అర్జున్ బ‌దులిచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా అలాంటి సంట‌నే హీరో రానాకు ఎదురైంది. ఇండ‌స్ట్రీలో బందు ప్రీతి వుంద‌ని, ఆ కార‌ణంగానే టెస్త్ కూడా పాస్ కానీ రానా వెన‌క ఓ స్టూడియో, నిర్మాణ సంస్థ వుంది కాబ‌ట్టే హీరో అయ్యాడ‌ని ఓ నెటిజ‌న్ రానాకు సంబంధించిన‌ ఓ పాత వీడియోని షేర్ చేసి ఇబ్బంది పెట్టాల‌ని ప్ర‌య‌త్నించాడు.

దానికి ఆగ్ర‌హించ‌ని రానా కూల్‌గా అత‌నికి దిమ్మ‌దిరిగే రిప్లై ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎంత స్టూడియో, నిర్మాణ సంస్థ వెన‌క వున్నా న‌ట‌న నేర్చుకోలేన‌ప్పుడు అవి వుండి కూడా వృధానే క‌దా బ్ర‌ద‌ర్ అని స‌మాధానం చెప్పాడు రానా. దీంతో స‌ద‌రు నెటిజ‌న్ దెబ్బ‌కు సైలెంట్ అయిపోయాడు. ఈ స‌ర‌దా సంభాష‌ణ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రానా న‌టిస్తున్న తాజా చిత్రం `హ‌థీ మేరే సాథీ`. తెలుగులో అర‌ణ్య‌, త‌మిళంలో కాడ‌న్ పేరుతో ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది.