సోషల్ మీడియాలో ఏ విషయంపై స్పందించాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అలా ఆలోచించకుండా అనాలోచితంగా స్పందిస్తే ఆ తరువాత నెటిజన్స్ చేతిలో అడ్డంగా బుక్కావ్వాల్సిందే. మంచు వారబ్బాయి ముంచు మనోజ్ అజాగ్రత్తగా చేసిన ఓ ప్రామిస్ అతన్ని అడ్డంగా బుక్ చేసింది. ఇటీవల భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న మంచు మనోజ్ జనవరి 28న `ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యింది. ఈ వీక్‌లో ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ వుండబోతోంది. వేచి చూడండి` అని మనోజ్ ఓ పోస్ట్ పెట్టాడు.
రెండు వారలైనా అతని నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఓ నెటిజన్ వీక్ అంటే 20 లేదా 30 వారాల తరువాతా అన్నా.. త్వరగా చెప్పు అన్నా.. అంటూ మనోజ్‌ని నిలదీశాడు. దీంతో సారీ చెప్పక తప్పలేదు. `సారీ తమ్ముడూ ఇంకొంచం టైమ్ వేయిటింగ్ అంటే అంటూ మంచు మనోజ్ ఏడుస్తున్నఎమోజీని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో తొందరపడి ఏదీ ట్వీట్ చేయకూడదని, అలా చేస్తూ ఫ్యాన్స్‌కు అడ్డంగా బుక్కయిపోతామని హీరోల్లో భయం మొదలైందట. అంతేగా.. అంతేగా..
😂 sorry thammudu …. inkkoncham time waiting anthe 🙏🏻❤️ https://t.co/4mDzBOsQnn
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 11, 2020