వరుసగా మూడు ఫ్లాప్‌లని సొంతం చేసుకుని రేస్‌లో మళ్లీ వెనకబడ్డాడు యంగ్ హీరో నితిన్. అయితే తాజాగా వరుస చిత్రాలతో షాకిస్తున్నాడు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా గురువు పవన్ తరహాలోనే ఏకంగా నాలుగు చిత్రాల్ని లైన్లో పెట్టేశాడు. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుములతో `భీష్మ` చిత్రం చేస్తున్న నితిన్ ఇది చిత్రీకరణలో వుండగానే మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
`రంగ్‌దే` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంతో కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా వుంటే విభిన్నచిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. `చెక్` పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూడు చిత్రాలు సెట్స్‌పై వుండగానే మరో హిట్ రీమేక్‌కి పచ్చ జెండా ఊపేశాడు. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం `అంధాధున్`. రాధికా ఆప్టే. టబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఇదే చిత్రాన్ని తెలుగులో నితిన్ చేయబోతున్నాడు.
దీనికి సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఫైనల్‌గా నాని దర్శకుడిని పట్టేశాడు. నానితో `కృష్ణార్జున యుద్ధం` చిత్రాన్ని రూపొందించిన మేర్లపాక గాంధి గత రెండేళ్లుగా నెక్స్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి `అంధాధున్` రీమేక్ బాధ్యతల్ని అప్పగించినట్టు తెలిసింది. సమ్మర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని స్వయంగా నితిన్ నటిస్తూ నిర్మించనున్నారు.