నిఖిల్ కొత్త ఫిల్మ్ షురూ.. టైటిల్ ఇదే!

ఎవ్వ‌రికైనా ఒక్క హిట్టు ప‌డితే కెరీర్ మారిపోతుంది అన్న‌ది తెలిసిందే. `అర్జున్ సుర‌వ‌రం` అస‌లు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా? అని భావించిన నిఖిల్‌కు ఈ సినిమాతో సాలీడ్ హిట్ త‌గిలింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ ఊపులో వున్న నిఖిల్ వ‌రుస‌గా రెండు చిత్రాల్ని లైన్‌లోకి తీసుకొచ్చాడు. 2014లో వ‌చ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `కార్తికేయ‌`. ఈ చిత్రానికి సీక్వెల్‌గా `కార్తికేయ 2` చేయాల‌ని, చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తూనే వున్నాయి కానీ ప్రాజెక్ట్ మాత్రం ప్రారంభం కాలేదు.

ఆ ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు క‌లియుగ దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధిలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. తాజాగా గురువారం మ‌రో ప్రాజెక్ట్‌ని నిఖిల్ మొద‌లుపెట్టాడు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `కుమార్ 21 ఎఫ్‌` ఫేమ్ ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గురువారం లాంఛ‌నంగా మొద‌లైన ఈ చిత్రానికి `18 పేజెస్‌` అనే వెరైటీ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వహ‌రిస్తున్నాడు కాబ‌ట్టే ఈ చిత్రానికి ఇలాంటి వెరైటీ టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది.