నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ విడుదల!

నానీస్ ‘గ్యాంగ్ లీడర్’  ఫస్ట్ లుక్ విడుదల!

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ ల కాంబినేషన్లో నిర్మిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు రిలీజైంది. బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను..అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని నాని విడుదల చేశారు. పోస్టర్ లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నాని తో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ తో, ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లో ఉన్నదెవరో రెవీల్ చేశారు. కథానుగుణంగా ఉన్న గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది. ఫస్ట్ సాంగ్ ని జులై 18 న, టీజర్ ని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తో డిఫరెంట్ లుక్ లో ఉండే ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన గ్యాంగ్ లీడర్’ ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30 న విడుదల కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నాడు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ ఈ విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు.