నాని 27 టైటిల్ ఇంట్రెస్టింగ్ వుందే!

ఈ మ‌ధ్య స్టార్ హీరోల నుంచి మినిమ‌మ్ గ్యారెంటీ హీరోల వ‌ర‌కు సినిమాల విష‌యంలో స్పీడు పెంచేశారు. ఒక సినిమా సెట్స్‌పై వుండ‌గానే మ‌రో సినిమాని లైన్‌లో పెట్టేస్తున్నారు. మ‌రి కొంత మంది మాత్రం రెండు నుంచి మూడు చిత్రాల లైన‌ప్‌తో షాకిచ్చేస్తున్నారు. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి టాలీవుడ్‌లో లేదు కానీ ఇప్పుడెందుకో వ‌రుస సినిమాల‌తో హీరోలు షాకిచ్చేస్తున్నారు. ఈ జాబితాలో నేచుర‌ల్ స్టార్ నాని కూడా చేరిపోయాడు. శివ నిర్వాణ‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌`, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో `వి` చిత్రాలు చేస్తున్న నాని తాజాగా మ‌రో చిత్రాన్ని ఓకే చేసేశాడు.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీతో క‌లిసి `జెర్సీ` చిత్రాన్ని చేసిన నాని ఇదే నిర్మాత‌తో మ‌రో చిత్రాన్ని చేబోతున్నాడు. నాని న‌టిస్తున్న 27వ చిత్ర‌మిది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఈ రోజు (సోమ‌వారం` రాబోతోంది. ఆదివార‌మే హింట్ ఇచ్చిన నిర్మాణ వ‌ర్గాలు సోమ‌వారం ఫుల్ క్లారిటీ ఇవ్వ‌బోతున్నారు. ఈ చిత్రానికి `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌కుడు. టైప్ రైట‌ర్ ని వాడుకుని ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ని వెల్ల‌డించిన మేక‌ర్స్ ఈ సినిమా కోసం `శ్యామ్ సింగ రాయ్‌` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని డిసైడ్ చేసిన‌ట్టు తెలిసింది. వినూత్న‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని రాహుల్ సంక్రీత్య‌న్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.