నాని బాల్క‌నీలో ర‌హ‌స్యం!

నేచుర‌ల్ స్టార్ నాని బాల్క‌నీలో ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డింది. ఆ విష‌యం నానీకి కూడా తెలియ‌దంట‌. ఇన్నేళ్లుగా బాల్క‌నీలో తిరుగుతున్నా ఆ విష‌యాన్ని మాత్రం గుర్తించ‌లేక‌పోయాడ‌ట‌. ఇంత‌కీ హీరో నాని బాల్క‌నీలో వున్న ర‌హ‌స్యం ఏంటంటే నాని ఇంటి బాల్క‌నీలో ఓ చెట్టుని పెంచుకుంటున్నాడు. ఆ చెట్టుపై ఓ ప‌క్షి కూడుని పెట్టుకుని పిల్ల‌ల‌తో జీవిస్తోంది. ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ కార‌ణంగా ఈ విష‌యం నాని కంట‌ప‌డింది.

అంతే ఆ వీడియోని నాని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. `ఊరంతా సైలెంట్‌గా ఉంది. ఇన్ని రోజులు కాలుష్యం, శ‌బ్దాల వ‌ల్ల తెలియ‌ని కొత్త కొత్త విష‌యాలు తెలుస్తున్నాయి. మ‌న ఇంట్లో.. మ‌న బాల్క‌నీలో…` అంటూ ఓ వీడియోని షేర్ చేశాడు నాని. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్ననేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూని పాటించాల‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క‌ర్ఫ్యూకి సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు స్వ‌చ్ఛందంగా పాల్గొని విజ‌య‌వంతం చేశారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రాల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.