నాని కోసం మార్చిన క్లైమాక్స్ దెబ్బకొట్టిందా?

`గ్యాంగ్ లీడ‌ర్‌` క్లైమాక్స్ నాని కోసం మార్చారా

సినిమా అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. ఇంటర్వెల్ ఇలా ఉండాలి. క్లైమాక్స్ ఇలా ఉండాలి. క్లైమాక్స్ లో ఫైట్ ఉండాలి. ఇలా కొన్ని లెక్కలు వేసుకుని సినిమాలు తీస్తూంటారు. వాటిల్లో ఏ మాత్రం తేడా వచ్చినా చూసేవాళ్ల దాకా ఎందుకు హీరోలే ఒప్పుకోరు. అలా హీరోలు కోసం స్క్రిప్టు లు మార్చిన సంఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా గ్యాంగ్ లీడర్ కు అలాంటిదే జరిగిందని అంటున్నారు.

మొదట రాసుకున్న వెర్షన్ ప్రకారం క్లైమాక్స్ .. దర్శకుడు విక్రమ్ కుమార్ తన స్టైల్లో చాలా డిఫరెంట్ గా రాసుకున్నాడట. తన తెలివితోనే శత్రువుని నాశనం చేసినట్లు ఆ క్లైమాక్స్ ఉంటుందిట. అయితే హీరో నాని దానికి ఒప్పుకోలేదట. చివర్లో అయినా విలన్ , తను ఒకరికొకరు ఎదురు పడి ఫైట్ చేసుకోకపోతే కిక్ ఏముంటుందని వాదించి మార్పించాడట. అయితే అదే ఇప్పుడు సినిమాకు మైనస్ గా మారిందని చెప్తున్నారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన `గ్యాంగ్ లీడ‌ర్‌` కొంతమందికు నచ్చినా డివైడ్ టాక్ మాత్రం వచ్చింది. విక్ర‌మ్ కె.కుమార్ మ్యాజిక్ వర్కవుట్ కాలేద‌ని, సెకండాఫ్ ఇంట్రస్టింగ్ గా మ‌ల‌చ‌లేక‌పోయాడ‌ని రివ్యూలలో తేల్చేశారు. దాంతో బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ్యాంగ్ లీడ‌ర్ డివైడ్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ విష‌యంలో విక్ర‌మ్ మ‌రీ రొటీన్‌గా ఆలోచించ‌డని సగటు ప్రేక్షకుడు సైతం ఫీలవుతున్నారనేది మాత్రం నిజం.