నాని కోసం ఆ క్లాసిక్‌ని కాపీ చేస్తున్నారా?

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ రూపొందిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి` అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే వ‌రుస‌గా మూడు చిత్రాల్నిప్ర‌క‌టించిన నాని మాంచి జోరుమీదే క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా త‌నతో `నిన్ను కోరి` వంటి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అందించిన శివ నిర్వాణ‌తో చేస్తున్నరెండ‌వ చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`పై చాలా ఇంట్రెస్టింగ్ వున్నార‌ట‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది.

ఈ చిత్ర క‌థ ఓ క్లాసిక్ సినిమాకి కాపీ అని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. గ‌త కొన్నేళ్ల క్రితం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క్లాసిక్ `అగ్నిన‌క్ష‌త్రం`. ఇదే చిత్రాన్ని తెలుగులో `ఘ‌ర్ష‌ణ‌` పేరుతో రిలీజ్ చేశారు. కార్తిక్‌, ప్ర‌భు హీరోలుగా న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి మ‌ణిర‌త్నం కెరీర్‌లో ఓ క్లాసిక్‌గా నిలిచింది. ఇదే సినిమా స్ఫూర్తితో `ట‌క్ జ‌గ‌దీష్‌`ని ద‌ర్శ‌కుడు శివ నిక‌ర్వాణ డిజైన్ చేశాడ‌ని,ఈ చిత్రంలో నాని, జ‌గ‌ప‌తిబాబు అన్నాద‌మ్ములుగా న‌టిస్తున్నార‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య `ఘ‌ర్ష‌ణ‌` త‌ర‌హాలోనే వైరం వుంటుంద‌ని తెలుస్తోంది.

అయితే `ఘ‌ర్ష‌ణ‌` మెయిన్ ప్లాట్‌ని తీసుకున్నా దానికి తెలుగు సెన్సిబులిటీస్‌ని జోడించి కొత్త‌గా మార్చాడ‌ని, ఆ క్లాసిక్ సినిమాకి న్యూ వెర్ష‌న్‌గా `ట‌క్ జ‌గ‌దీష్` వుంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి శివ నిర్వాణ చేస్తున్న ప్ర‌యోగం నానికి హిట్‌ని అందిస్తుందా? ల‌ఏక విమ‌ర్శ‌ల‌కు గురిచేస్తుందో చూడాలి.