కరోనా తో అన్ని రంగాలు అర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో 24 శాఖలు కూడా పారితోషికంగా తగ్గించుకుని పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా స్టార్ హీరోలంతా పారితోషికం సగానికి పైగా తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కమిట్ మెంట్లు అన్ని కూడా అలాగే జరుగుతున్నాయి. థియేటర్లు కూడా ఇంకా తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో నిర్మాతల కండీషన్లతో హీరోలు ఏకీభవించాల్సిన పరిస్థితి. ఆ మధ్య స్టార్ హీరోలందరితో నిర్మాతల గిల్డ్ సమావేశమై దీనిపై చర్చించడం జరిగింది.
అయితే ఈ ఎఫెక్ట్ కింగ్ నాగార్జునపై మాత్రం పడలేదు. సినిమాల పారితోషికం పరంగా కాదు. ఓ రియాల్టీ గేమ్ పరంగానని సమాచారం. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ -4కి నిర్వాహకులు అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. యాధావిధిగా సీజన్ -3కి ఇచ్చిన పారితోషికంగా 5 కోట్ల రూపాయల్నే సీజన్ -4కి గాను అందిస్తున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలోనే కింగ్ పారితోషికంపై కోత పడుతుందని జరుగుతోన్న ప్రచారం నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఈ విషయం లీకైంది. నాగార్జున మూడవ సీజన్ కు 30 ఎపిసోడ్లకు గాను 5 కోట్లు ఛార్జ్ చేసారు.
ఇక సినిమాల పరంగా నాగార్జున్ మార్కెట్ బాగా డౌన్ ఫాల్ ఉన్న సంగతి తెలిసిందే. సరైన సక్సెస్ లు లేకపోవడం, యంగ్ హీరోలు దూసుకు రావడం వంటి పరిస్థితులు కొంత మంది స్టార్ హీరోల మార్కెట్ పై ప్రభావం పడింది. అందులో నాగార్జున కూడా ఒకరు. కొన్నాళ్లగా పరిమిత బడ్జెట్ లోనే నాగార్జున నటించే సినిమాల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కింగ్ సైతం టీవీ గేమ్ షోలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మీలో ఎవరు కోటీ శ్వరుడు అనే ఓ షో కు హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే బిగ్ బాస్ సీజన్ -3కి హోస్ట్ గా చేసారు.