దేవుడు వ‌ర‌మిచ్చినా కుక్క క‌నిక‌రించాల‌ట‌!

క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మందన్న‌కు అల్ల‌రి ఎక్కువే. ఎక్క‌డ వున్నా త‌న అల్ల‌రి మాట‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం ర‌ష్మిక స్టైల్‌. `ఛ‌లో` సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ త‌రువాత వ‌రుస‌గా గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ వంటి చిత్రాల్లో న‌టించి క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో సుకుమార్ ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది.

ఇందు కోసం ప్ర‌త్యేకంగా చిత్తూరు యాస‌ని కూడా నేర్చుకుంది. లాక్‌డౌన్ త‌రువాత షూటింగ్ ఎప్పుడు మొద‌లైతే అప్పుడు షూటింగ్‌లో పాల్గొన‌డానికి ర‌ష్మిక సిద్ధ‌మ‌వుతోంది. క‌రోనా ప్ర‌భావం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఇంటికే ప‌రిమిత‌మైన ర‌ష్మిక స‌ర‌దాగా మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులతో ముచ్చ‌టించింది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కొంటెగా స‌మాధానాలు చెప్పింది.

లాక్‌డౌన్ ఎత్తేశాక త‌న స్నేహితుల్ని క‌లుస్తాన‌ని చెప్పింది. ఇక `దిల్ వాలే దుల్హ‌నియా లేజాయేంగే`లో షారుఖ్, కాజ‌ల్ త‌ర‌హాలో మీరు నాతో డేటింగ్‌కి వ‌స్తారా అని ఓ అభిమాని అడిగితే న‌న్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి అంది. దేవుడు నాకు ఎదురైనా న‌న్ను నీ భ‌ర్త‌ని చేయ‌మ‌ని అడుగుతా అని ఓ అభిమాని ప్ర‌శ్నిస్తే మాత్రం అత‌డికి కొంటెగా దిమ్మ‌దిరిగే ఆన్స‌ర్ ఇచ్చింది. `ద‌యచేసి ముందు త‌న కుక్క అనుమ‌తి తీసుకోమ‌ని షాకిచ్చింది. దీంతో నెటిజ‌న్స్ అంతా ర‌ష్మిక‌ని పెళ్లాడాలంటే ఆమె పెంపుడు కుక్క అనుమ‌తి తీసుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు.