వి.వి.వినాయక్‌ని హీరోగా పరిచయం చేయాలని దిల్ రాజు చేసిన ప్రయత్నం అతని మెడకే చుట్టుకుని చుక్కలు చూపిస్తోంది. ఈ చిత్రానికి నరసింహారావు దర్శకుడు. అయితే అతనికి, వినాయక్‌కు క్రియేటీవ్ డిఫరెన్సెస్ వచ్చాయిట. ఆ కారణంగానే ఈ సినిమాపై వినాయక్ అంతగా ఆసక్తిని చూపించడం లేదని, అదే దిల్ రాజుకు పిచ్చెక్కిస్తోందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
ఇదంతా మనకి అవసరమా? అని భావించిన దిల్ రాజు ఈ చిత్రాన్ని ఆపేయాలని డిసైడ్ అయ్యారట. అయితే ఇన్నేళ్ల తన కెరీర్‌లో తమ బ్యానర్‌లో ఏ చిత్రాన్ని మధ్యలో ఆపేయలేదని, అది తనకు, తన బ్యానర్‌కు మచ్చగా మిగిలే అవకాశం వుందని భావించిన దిల్ రాజు మధ్యలో ఆపేసిన `శీనయ్య`ను ఎలాగోలా పూర్తి చేసిరిలీజ్ చేయాలనుకుంటున్నారట. మరి దీనికి వినాయక్ సహకరిస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.