త్రివిక్రమ్ ఎంట్రీ.. నితిన్‌కి క‌లిసొస్తుందా?

నితిన్ `ఇష్క్‌` సినిమా ఆడియో రిలీజ్‌కి ప‌వ‌న్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన విష‌యం తెలిసిందే అక్క‌డి నుంచే నితిన్ జాత‌కం మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా 12 ఫ్లాప్‌లు అందుకున్న నితిన్ `ఇష్క్‌`తో స‌క్సెస్ బాట ప‌ట్టాడు. ఈ సినిమా త‌రువాత వ‌రుసగా రెండు విజ‌యాల్ని ద‌క్కించుకున్నాడు. రెండు ఫ్లాప్‌ల‌ని ద‌క్కించుకున్నాడు. అయితే నితిన్ మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది ప‌వ‌న్ గెస్ట్‌గా వ‌చ్చిన `అఆ`తోనే కావ‌డం విశేషం. `అఆ` త‌రువాత మ‌ళ్లీ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు `భీష్మ‌`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన వెంకీ కుడుముల రూపొందిస్తున్నాడు. ఈ సినిమా హిట్ నితిన్‌కి చాలా అవ‌సరం. సినిమా త్రివిక్ర‌మ్ మార్కు ఫ్లేవ‌ర్‌తో సాగేలా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, సింగిల్స్ అంథెమ్ సినిమాపై పాజిటీవ్ బ‌జ్‌ని క్రియేట్ చేశాయి. దీంతో టీమ్ అంతా స‌క్సెస్ గ్యారెంటీ అనే సంబ‌రాల్లో వున్నారు. ఈ 15న నితిన్ పెళ్లి హంగామా మొద‌లైంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రీరిలీజ్ హంగామా జ‌ర‌గ‌బోతోంది. అంటే ఈ నెల 17న ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌ని యూస‌ఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మాట‌ల మాంత్రికుడు చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌వుతున్నారు. ప‌వ‌న్ లాగే త్రివిక్ర‌మ్ రాక‌తో నితిన్‌కు ల‌క్కు క‌లిసొస్తుందా? మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టిస్తుందా? అని అంతా చ‌మ‌త్క‌రిస్తున్నారు నిజ‌మే మ‌రి.