దర్శకుడు మిస్కిన్‌తో `తుప్పారివాలన్ -2` చిత్రాన్నినిర్మిస్తూ విశాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ విషయంలో దర్శకుడు మిస్కిన్‌కు, హీరో, కమ్ నిర్మాత విశాల్‌కు అభిప్రాయభేదాలు వచ్చాయి. కేవలం లండన్ షెడ్యూల్ కోసమే వృధాగా 13 కోట్లు ఖర్చు చేయించాడట. దీంతో ఆగ్రహించిన విశాల్ దర్శకుడు మిస్కిన్‌ని తప్పించి తానే దర్శకుడిగా మిగతా చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ విషయాన్ని ఈ రోజు వెల్లడించిన విశాల్ దర్శకుడు మిస్కిన్‌ని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేయడం సంచలనం సృష్టిస్తోంది. ఒక నిర్మాతగా చిత్ర నిర్మాణం పట్ల నాకు అవగాహన వుండదా?. ఈ విషయంలో దర్శకుడికి సూచనలు ఇవ్వడం తప్పా? అని విశాల్ ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా విశాల్ రిలీజ్ చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. `ఈ ప్రకటన యొక్క ఏకైక ఏద్దేశం ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు. అలాంటి వ్యక్తుల చేతిలో మరేనిర్మాత బలైపోకుండా చూసుకోవాలి. దర్శకుడిగా బాధ్యతలు చేపడుతున్నాను. మీ ఆశీస్సులు కావాలి. ఒక దర్శకుడిగా ఉత్తమంగా సినిమాని రూపొందించాలనుకుంటున్నాను`అని విశాల్ పోస్ట్ చేశాడు.
The sole purpose of the statement is not to tarnish one's image but is only to make sure that nobody falls prey to such people especially Producers
Seeking your blessings & wishes for my directorial debut & hoping to do the best as a Director#Thupparivaalan2 #VishalDirection1 pic.twitter.com/5CnGYlmsrD
— Vishal (@VishalKOfficial) March 11, 2020