హీరో రవితేజ నటించిన తాజా చిత్రం `డిస్కోరాజా` వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైఫై యాక్షన్ చిత్రం జనవరి24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈచిత్రం ప్రమోషన్స్ జోరు మొదలయింది. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు.. రెండు పాటలు చాలా బావున్నాయి. మంచి వ్యూస్‌ను సంపాదించుకుంది. ఈ రోజు ఈ చిత్రం నుండి రమ్ పమ్ బమ్ అంటూ సాగే డిస్కో స్టైల్లో సాంగ్ ను విడుదల చేశారు.
ఈ మధ్య కాలంలో తమన్ ఇచ్చే మ్యూజిక్ సూపర్‌డూపర్ హిట్లు అవుతున్నాయి. ప్రస్తుతం వచ్చిన దాదాపుగా హిట్ చిత్రాలన్నిటికీ తమన్ మ్యూజికే.. ప్రతిరోజూపండగే, అలవైకుంఠపురంలో, ఇప్పుడు తాజాగా డిస్కోరాజా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో పాటలన్నీ చాలా బావున్నాయి. ఈ పాటకు సాహిత్యం అందించినవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. పాడినవారు రవితేజ.. బప్పీ లహరి.. శ్రీకృష్ణ. “కాలం ఆగాలి నా కాలి వేగం చూసి లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి కొండలే ఊగి పోవాలి నా జోరుకి.. దిక్కులే పారిపోవాలి నా హోరుకి” అంటూ సింపుల్ పదాలతో సాగింది పాట సాహిత్యం. పాత బప్పీ లహరి పాటల స్టైల్ ను కొంచెం గుర్తు తెస్తూనే ఈతరం ఇన్ స్ట్రుమెంటేషన్ తో తమన్ సూపర్ ట్యూన్ ఇచ్చాడు.
ఇక రవి తేజ పాట మధ్యలో “ఆఆ.. రమ్ ప బమ్ రబరిబ” అంటూ చేసిన హమ్మింగ్ పాటకు హైలైట్ గా నిలుస్తుంది. డిస్కో పాటకు ఈ హమ్మింగే చాలా అందాన్ని తీసుకొస్తుంది. అసలే సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ పాటతో కూడా తన ఫామ్ ను ఇంకాస్త కొనసాగించాడు. మాస్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు కానీ స్లోగా అందరికీ నచ్చే పాట ఇది. ఈ పాటకు వీడియో కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది.ఇక ఈ మద్య రవితేజ సినిమాలు పెద్దగా హిట్ కావడంలేదు. మరి ఈ చిత్రంతోనైనా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.