ట్రైల‌ర్ టాక్ : `నిశ్శ‌బ్దం` సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌

అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌కుడు. `బాహుబ‌లి` త‌రువాత అనుష్క మార్కెట్ స్థాయి పెరిగింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. కోన వెంక‌ట్‌తో క‌లిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్స‌న్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. అరంధ‌తి, భాగ‌మ‌తి వంటి థ్రిల్ల‌ర్ చిత్రాల త‌రువాత అనుష్క న‌టిస్తున్న డార్క్ థ్రిల్ల‌ర్ ఇది.

ఈ చిత్ర ట్రైల‌ర్‌ని హీరో నాని రిలీజ్ చేశారు. ఇదిగో స్వీటీస్ట్ స్వీటీ `నిశ్శ‌బ్దం` ట్రైల‌ర్‌. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌` అని ట్వీట్ చేశాడు. అమెరికా నేప‌థ్యంలో సాగు థ్రిల్ల‌ర్ ఇది. ద‌య్యాల కొంప అనే పేరున్న‌ వుడ్ సైడ్ విల్లా ఈ రోజు మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది అనే ఓ న్యూస్ రీడ‌ర్ వాయిస్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. తొలి వాయిస్‌తోనే సినిమా ఏ జోన‌ర్‌లో వుంటుంది? ఎలా వుండ‌బోతోంద‌నేది క్లారిటీ వ‌చ్చేసింది. అనుష్క చుట్టూ జ‌రిగే అనూహ్య సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా ఈ సినిమా సాగుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలో అనుష్క‌ని అంజ‌లి ఎందుకు అనుమానిస్తోంది? ఇంత‌కీ షాలినీ పాండే పాత్ర ఎవ‌రు? ఇంత‌కీ అనుష్క‌రి భ‌య‌పెడుతున్న ఆ ఘోస్ట్ ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా సినిమాఆత్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగేలా క‌నిపిస్తోంది. `నిశ్శబ్దం` ఎందుకు? ఏమీటి? ఎలా అన్న‌ది తెలియాలంటే ఏప్రిల్ 2 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Nishabdham Trailer : Telugu | Anushka Shetty | R Madhavan | Anjali | Shalini | Hemant Madhukar