టెర్రరిస్ట్ పాత్రలో సమంత

విలన్ గా భయపెట్టనున్న సమంత

సమంత త్వరలో నెగిటివ్ పాత్రలోకనిపించి భయపెట్టనుందిట. లేడీ టెర్రిరిస్ట్ గా ఆమె మారణహోమం సృష్టించనుందిట. ఈ మేరకు ఆమె రెడీ అవుతోంది. ఈ పాత్ర తనకు మంచి రెస్పాన్స్ తెస్తుందని ఆమె భావిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో టెలికాస్ట్ అయ్యే ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ లో పాత్ర అది. ఫ్యామిలీ మెన్.. హిందీ‌తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది.

అనేక భాషల్లో డబ్ అయిన ఈ సిరీస్ త్వరలోనే రెండో సీజన్ స్టార్ట్ కానుంది. తెలుగువారికి పరిచయం వున్న మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ లాంటి నటులు వుండటం ప్లస్ అయ్యింది. ఇక ఈ వెబ్ సిరీస్ రూపకర్తలు డికె అండ్ రాజ్ కూడా తెలుగువారికి పరిచయం వున్నవారే కావటం కలిసి వచ్చింది.

ఇక రెండో సీజన్ లో ..పాక్ – ఇండియా వ్యవహారాలు, కాశ్మీర్, టెర్రరిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మొదటి సీజన్‌లో 10 భాగాలు అందించారు. ఇప్పుడు రెండో సీజన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే టెలికాస్ట్ అవ్వనుంది. రెండో సీజన్‌లో సమంత కూడా నటించిందని అందరికి తెలిసిందే. ఇందులో సామ్ ఎన్నడూ చేయని విధంగా నెగటివ్ రోల్ లో కనిపించనుంది. టెర్రరిస్ట్‌గా కనిపించబోతోంది.

పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకుంది. ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో అధిక శాతం పెళ్లి తర్వాత చేసినవే. వివాహం తర్వాత గ్లామరస్ పాత్రలు తగ్గించి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలపై సమంత దృష్టి సారించింది. దీంతో వరుస విజయాలతోపాటు మంచి నటిగా గుర్తింపు కూడా సంపాదించుకుంది. వెబ్ సీరిస్ లో విభిన్న పాత్రలో సమంత కనిపించబోవటంతో ఆమె అభిమానులు ఆనందదపడుతున్నారు.