టీజ‌ర్ టాక్‌: రామ్ డ‌బుల్ ధ‌మాకా

హీరో రామ్ పంథాని పూర్తిగా మార్చిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ కొత్త త‌ర‌హా క‌థ‌తో రామ్ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. త‌న‌ని హిట్ బాట ప‌ట్టించిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న తాజా చిత్రం `రెడ్‌`. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ డ్యుయ‌ల్ రోల్‌లో న‌టిస్తున్నారు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీ టీజ‌ర్‌ని మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. `క్రైమ్ హిస్ట‌రీలో ఇలాంటి కేస్‌ని చూడ‌టం ఇదే ఫ‌స్ట్ టైమ్‌.. అనే డైలాగ్‌తో ఈ టీజ‌ర్ మొద‌లైంది. భిన్న మ‌న‌స్థ‌త్వాలు గ‌ల ఇద్ద‌రు యువ‌కుల మ‌ధ్య సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఒక పాత్ర క్లాస్‌గానూ మ‌రో పాత్ర మాసీవ్‌గానూ చెప్పాలంటే `ఇస్మార్ట్ శంక‌ర్` త‌ర‌హా పాత్ర‌లో రామ్ క‌నిపిస్తున్నాడు.

ఆదిత్య‌గా, సిద్ధార్ధ‌గా రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నా ఒక‌రిని ఒక‌రు క్రైమ్‌లో ఇరికించే పాత్ర‌ల‌ని ఆర్థ‌మ‌వుతోంది. సిద్ధార్థ క్రైమ్ చేసి ఆదిత్య‌ని ఇరికిస్తాడా? లేక ఆదిత్య క్రైమ్ చేసి సిద్ధార్ధ‌నే ఇరికిస్తాడా? అన్న‌ది తెర‌పైన చూడాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే రెడ్ రామ్ డ‌బుల్ ధ‌మాకా అన్న‌మాట‌. నివేదా పేతురాజ్ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తోంది. ఆమెకి రామ్ రెండు పాత్ర‌ల‌కీ వున్న సంబంధం ఏంటి? అన్న‌ది చాలా రేసీ స్క్రీన్‌ప్లేతో న‌డిపించిన‌ట్టు క‌నిపిస్తోంది. టీజ‌ర్‌కు మ‌ణిశ‌ర్మ ఆర్ ఆర్, స‌మీర్‌రెడ్డి ఫొటోగ్ర‌ఫీ హైలైట్‌గా క‌నిపిస్తోంది. సినిమా అంతా ఇదే రేసీగా సాగితే ఏప్రిల్ 9న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాతో రామ్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్టే.

RED Official Teaser | Ram Pothineni | Nivetha Pethuraj | Malvika Sharma | Amrita | Kishore Tirumala