టీజ‌ర్ టాక్‌: పోలీస్ వ‌ర్సెస్ కిల్ల‌ర్‌

నాని, సుధీర్‌బాబు తొలిసారి క‌లిసి న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్ నిర్మిస్తున్నారు. నివేదా థామ‌స్‌, అదితీరావు హైద‌రీ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ర‌క్ష‌కుడు – రాక్ష‌సుడు త‌ర‌హా పాత్ర‌ల్లో సుధీర్‌బాబు, నాని న‌టిస్తున్నారు. సోమ‌వారం ఈ చిత్ర టీజ‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. సుధీర్ బాబు ఇంట్రోతో టీజ‌ర్ మొద‌లైంది. ఫూల్స్ మాత్ర‌మే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అప్పుడ‌ప్పుడు నాలాంటోడు రూల్స్ కొద్దిగా బ్రేక్ చేస్తుంటాడు అంతే` అంటూ సుధీర్‌బాబు క్యారెక్ట‌ర్ ఎలా వుంటుందో చిన్న హింట్ ఇచ్చారు.

నాని ఇంట్రో మాత్రం రాక్ష‌సుడు త‌ర‌హాలోనే వ‌యొలెంట్‌గా వుంది. సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా సీరియ‌స్ పాత్ర‌లో నాని క‌నిపిస్తున్నాడు. అత‌న్ని వేటాడే ఏసీపీగా సుధీర్‌బాబు న‌టించాడు. టీజ‌ర్‌లోని ఓ సీన్‌లో నివేదా థామ‌స్‌…యూ ఆర్ ఏ సైకో యూ నో ద‌ట్‌? అని హెచ్చిరంచే డైలాగ్స్ సినిమాలో నాని పాత్ర ఎలాంటిదో చెప్పేస్తోంది. టేకింగ్‌, మేకింగ్ ప‌రంగా కొత్త ఫీల్‌ని క‌లిగించినా ఎక్క‌డో కొడుతోంది. నానిని ఏ బాయ్ నెక్ట్స్ డోర్‌లా చూసిన ప్రేక్ష‌కులు సైకో కిల్ల‌ర్ పాత్ర‌లో అంగీక‌రిస్తారా? అన్న‌దే పెద్ద క్వ‌శ్చ‌న్ మార్కుగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.

`జెంటిమ‌న్‌` సినిమాలో కొంత నెగెటివ్ ట‌చ్ ఇచ్చి నాని పాత్ర‌ని డిజైన్ చేసి స‌క్సెస్ అయిన ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ `వి`లో పూర్తి స్థాయి విల‌న్‌గా నానిని ప్ర‌జెంట్ చేశాడా? లేదా? అత‌ని పాత్ర వెన‌కున్న అస‌లు కథేంటి?. ఎందుకు సైకోలా హ‌త్య‌లు చేస్తున్నాడు అన్న‌ది తెలియాలంటే మార్చి 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

V Teaser - Nani, Sudheer Babu, Nivetha Thomas, Aditi Rao Hydari | Mohan Krishna Indraganti