మాస్ మహారాజా రవితేజ ఈ సారి ఖచ్చితంగా హిట్టు కొట్టేలాగే వున్నాడుగా. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది. గతంలో వీరిద్దరి కలయికలో డాన్‌శీను, బలుపు చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే.
శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టే రవితేజ పాత్ర కిర్రాక్‌గా వుంది. `ఒంగోల్‌లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే ఖచ్చితంగా మర్డరే… అనే వాయిస్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అప్పిగా.. తుప్పిగా.. నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా.. అంటూ మాస్‌రాజా రవితేజ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలని పెంచేస్తోంది. హిట్టు కోసం కసిగా ఎదురుచూస్తున్న గోపీచంద్ మలినేని, మాస్ రాజా రవితేజ ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్‌ని కొట్టేలా వున్నారు.
యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్‌రాజా రవితేజ పాత్ర కొత్తగా కనిపిస్తోంది. ఓ కిర్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా ఇందులో కనిపిస్తున్నాడు. హిట్ కోసం కసిగా వున్న మాస్ రాజా ఈ టీజర్‌లో చెలరేగిపోయినట్టే తెలుస్తోంది. థియేటర్‌లో విజిల్స్ ఖాయంగా కనిపిస్తోంది. సింబాలిక్‌గా టీజర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ విజిల్స్ వేస్తున్న షాట్‌ని కట్ చేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. టీజర్‌లో జస్ట్ షాంపిల్‌గా చూపించారు. సినిమాలో వరు పాత్ర రచ్చ చేయబోతోందని అర్థమవుతోంది. టీజర్‌లోనే ఈ రేంజ్‌లో వుంటే ట్రైలర్‌లో ఇంకెంత చూపిస్తారో వేచి చూడాలి. మే 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది.