పెళ్లి తరువాత నుండి సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు హీరోయిన్ జ్యోతిక. చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. తమిళంలో తాను నటించిన ‘నాచియార్’ సినిమాను తెలుగులోకి అనువదించి ‘ఝాన్సీ’ టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు డీ.వీ.సినీ క్రియేషన్స్ బ్యానర్ వారు.
ఈ సినిమాలో జ్యోతిక పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించారు. తమిళనాట రిలీజ్ కి ముందు సినిమాలోని జ్యోతిక క్యారెక్టర్ కు నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. విడుదల తర్వాత ప్రశంసల వర్షం కురిపించారు అదే ప్రేక్షకులు. క్రైం డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో యువ నటుడు జీవీ ప్రకాష్ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత జ్యోతిక తెలుగు తెరపై కనిపించనున్నారు ఈ సినిమాతో. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.