జులై 22 న హైదరాబాద్ లో గాయని స్మిత వేడుక

అసలేమాత్రం అంచ‌నాలు లేకుండా ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే వచ్చింది స్మిత. మ్యూజిక్, డాన్స్ లో మ‌రింత శోధ‌న చేసి
ఎదిగింది. ఇప్పుడు ఆమె ప్రయాణం మొదలై 20 ఏళ్లైపోయింది. ఆ అనుభూతులు ఆమె మాటల్లోనే…
ఇప్పుడు ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్ర‌యాణం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఇండిపాప్ నేనే అయినందుకు చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. 10 కంటే ఎక్కువ భాష‌ల్లో పాడ‌టం కూడా నాకు గొప్ప అనుభ‌వం. వీట‌న్నింటితో పాటు 12 ఆల్బ‌మ్స్, 17 మ్యూజిక‌ల్ వీడియోలు, 100కు పైగా ప్లేబ్యాక్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్స‌ర్ట్స్.. ఓ ట్రోఫీ ఇంటికి తీసుకురావ‌డం
ఇవ‌న్నీ జీవితంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని తీపి అనుభూతులే.

అందుకే జులై 22న నా ఈ సంగీత, నృత్య ప్రయాణానికి సంబంధించిన ఓ వేడుక ఉంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం అయిన ప్ర‌తీ ఒక్క‌ర్ని అందులో నేను గుర్తు చేసుకోవాల‌నుకుంటున్నాను. నా ప్ర‌యాణం క్యాసెట్ నుంచి సిడి, సీడి నుంచి పెన్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్ నుంచి డిజిట‌ల్ వ్యూస్ ఇలా ఎన్నో మారిపోయాయి. నా
పాట‌లు వంద‌ల మిలియ‌న్స్ డిజిట‌ల్ వ్యూస్ దాటిపోయి ఎన్నో కోట్ల మంది
హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. ఈ ప్ర‌యాణంలో అదెంతో మ‌ధురానుభూతి నాకు. నాకు ఇంత సాధించ‌డానికి ఎంతో చేసిన వాళ్లంద‌ర్నీ గుర్తు చేసుకోడానికి.. వాళ్ల‌కు మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోడానికి ఏర్పాటు చేసుకున్నాను.

క‌ళ‌కు నేను ఇవ్వాల‌నుకుంటున్న గౌర‌వం ఇది. నా ముందున్న ల‌క్ష్యాల‌ను కూడా మీ ముందు ఉంచ‌బోతున్నాను. జులై 22 సాయంత్రం 7 గంట‌ల నుంచి హైద‌రాబాద్ JRC క‌న్వెన్ష‌న్ లో ఈ వేడుక‌ను చేసుకుందాం’ అంటూ చెప్పు కొచ్చింది స్మిత