జాన్వీ ఇంత సంప్ర‌దాయంగా వుండేదా?

జాన్వీ ఇంత సంప్ర‌దాయంగా వుండేదా?

శ్రీ‌దేవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫొటో సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో వైర‌ల్‌గా మారింది. జాన్వీ క‌పూర్ యుక్త వ‌య‌సులో వుండ‌గా, ఖుషీ క‌పూర్ చాలా చిన్న వ‌య‌సులో వుండ‌గా శ్రీ‌దేవి ఫ్యామిలీ ంతా క‌లిసి ఫొటోల‌కి పోజులిచ్చారు. అయితే నిత్యం మోడ్ర‌న్ డ్రెస్పుల్లో క‌నిపించే జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్‌. శ్రీ‌దేవి, బోనీ క‌పూర్ సంప్ర‌దాయ దుస్తుల్లో ముస్తాబై క‌నిపించ‌డం నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది.

ఈ ఫొటోని డ‌బ్బూ ర‌త్నానీ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేశాడు. ఈ ఫొటోకి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. `ఒక చిత్రం వెయ్యి పదాలకు విలువైనది, కానీ జ్ఞాపకాలు అమూల్యమైనవి ` అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. ‌25 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌గా డ‌బ్బూ ర‌త్నానికి మంచి పేరుంది. ప్ర‌తీ ఏడాది బాలీవుడ్ క్రేజీ తార‌ల‌తో డ‌బ్బూ ర‌త్నానీ రూపొందించే న్యూఇయ‌ర్ ఫొటో సెష‌న్‌కి, క్యాలెండ‌ర్‌కి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వుంది.

ఇటీవ‌ల డ‌బ్బూ ర‌త్నానీ విడుద‌ల చేసిన న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్‌పై చాలా మంది నెటిజ‌న్స్ అవి ఫేక్ ఫొటోల‌ని డ‌బ్బూ ర‌త్నానీ మార్ఫింగ్ చేసి హీరోయిన్‌ల‌ ఫొటోస్ని హాట్‌గా తీసిన‌ట్టుగా న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.