చెడు చూడ‌కు..విన‌కు..మాట్లాడ‌కు!

చెడు చూడ‌కు..విన‌కు..మాట్లాడ‌కు!

త‌మిళ హీరో విష్ణు విశాల్‌ ఓ ప‌క్క బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలాతో ల‌వ్‌స్టోరీ సాగిస్తూనే వెండితెర‌పై ఇంట్రెస్టింగ్ థ్రిల్ల‌ర్స్‌ని రెడీ చేస్తున్నాడు. ఇటీవ‌ల `రాక్ష‌‌స‌న్‌` చిత్రంతో సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకున్న విష్ణు విశాల్ తాజాగా మ‌రో సైకో థ్రిల్ల‌ర్‌తో రాబోతున్నాడు. ముర‌ళీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హీరో విష్ణు విశాల్ స్వ‌యంగా నిర్మిస్తూ న‌టిస్తున్నాడు.

ఈ చిత్రానికి `మోహ‌న్‌దాస్‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తెలుగులోనే రిలీజ్ కానున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని శ‌నివాసం హీరో విష్ణు విశాల్ సోష‌ల్ మీడియా ట్వి్ట‌ర్ వేదిక‌గా రిలీజ్ చేశారు. `రాక్ష‌స‌న్‌` చిత్రానికి మించి తాజా చిత్రం భ‌యంక‌రంగా వుంటుంద‌నిపిస్తోంది. హ్యామ‌ర్‌తో ఓ యువ‌తిని అత్యంత దారుణంగా విష్ణు విశాల్ హ‌త్య చేస్తున్న దృశ్యాలు ఒళ్లు గ‌గుర్పొడిచే విధంగా వున్నాయి. పైగా టీజ‌ర్‌లో `చెడు చూడ‌కు, చెడు విన‌కు, చెడు మాట్లాడ‌కు అనే సింబ‌ల్‌ని సూచించే మూడు కోతి బొమ్మ‌ల్ని చూపించారు.

అంటే మెంట‌ల్లీ డిజార్డ‌ర్ తో బాధ‌పడే ఓ యువ‌కుడు త‌న‌కు న‌చ్చ‌ని వారిని అతి దారుణంగా హ‌త్య‌లు చేసస్తుంటాడ‌ని అర్థ‌మ‌వుతోంది. లాక్ డౌన్ కార‌ణంగా ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని వాయిదా వేశారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌రువాతే ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభించోతున్న‌ట్టు హీరో విష్ణు విశాల్ వెల్ల‌డించాడు.

Mohandas - Title Announcement Teaser | Vishnu Vishal | Murali Karthick | VV Studioz