చిరు సినిమా ప‌రిస్థితి నాన్నా పులి క‌థ‌లా వుందే?

మెగాస్టార్ చిరంజీవి – కొర‌టాల శివ సినిమా ప‌రిస్థితి చూస్తుంటే చిన్న‌ప్పుడు చ‌దువుకున్న నాన్నా పులి క‌థ గుర్తొస్తోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నార‌నుకున్నఈ మూవీ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. చిరు గెట‌ప్ పిక్స్ లీక్ కావ‌డంతో ఇందులో చిరంజీవి అభ్యుద‌య భావాలున్న వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. న‌క్స‌లైట్ డ్రెస్‌లో వున్న ఫొటో లీక్ కావ‌డంతో సినిమా క‌థ ఇలా వుంటుంది. అలా వుంటుంది అని భిన్న క‌థ‌నాలు వినిపించ‌డం మొద‌లైంది.

ఇక ఈ సినిమాలోని కీల‌క అతిథి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తాడ‌ని కొన్ని రోజులు, లేదు లేదు ఆ పాత్ర‌లో మ‌హేష్‌ని తీసుకున్నార‌ని కొన్ని రోజులు ఫైన‌ల్‌గా రామ్‌చ‌ర‌ణ్ మాత్రమే ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని తాజాగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. టీమ్ స‌భ్యుల్లో ముఖ్యంగా చిరంజీవిలోనూ ఇదే భావ‌న వుండ‌టంతో ఫైన‌ల్‌గా రామ్‌చ‌ర‌ణ్ నే ఫిక్స్ చేసుకున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలోకి కీల‌క పాత్ర‌పై నాన్నా పులి క‌థ త‌ర‌హాలో వ‌రుస క‌థ‌నాలు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో షికారు చేస్తున్నా కొణిదెల పీఆర్ టీమ్ గానీ, రామ్‌చ‌ర‌ణ్ కానీ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ సినిమాపై మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇప్ప‌టికైనా ఈ నాన్నా పులి క‌థ‌కు ఫుల్ స్టాప్ పెట్టి పీఆర్ టీమ్ క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.